● అదనపు కలెక్టర్ అశోక్ కుమార్
చిట్యాల: తేమ శాతం తక్కువ వచ్చిన వరి ధాన్యాన్ని త్వరితగతిన మిల్లులకు తరలించాలని అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్ అన్నారు. సోమవారం మండలకేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ ఆవరణలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ ధాన్యం కొనుగోలు చేయాలని కొనుగోలు కేంద్రం ఇన్‌చార్జ్‌తో చెప్పారు. వ్యవసాయ శాఖ అధికారులు ప్రతీ రోజు కొనుగోలు కేంద్రాలను సందర్శించి కొనుగోలు కార్యకలాపాలను పర్యవేక్షించి తగు సూచనలు ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ గుమ్మడి శ్రీదేవి–సత్యం, డీసీఎస్‌ఓ కిరణ్‌కుమార్, తహసీల్దార్ షేక్‌ఇమామ్‌బాబా, సివిల్ సప్లయీస్ ఆర్‌ఐ రాజు, వెలుగు సీసీ రమాదేవి, ఏఈఓ సన్నీ, సందీప్ పాల్గొన్నారు.
అన్‌లోడింగ్‌ను వేగవంతం చేయాలి
మండలంలోని శాంతినగర్ శివారులోని శ్రీ వేంకటేశ్వర పారా బాయిల్ రైస్‌మిల్లును అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ సందర్శించారు. మిల్లులో ధాన్యం అన్‌లోడింగ్ వేగవంతం చేయాలని అన్నారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు.
కొనుగోలు కేంద్రం పరిశీలిన
టేకుమట్ల: మండల కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్ పరిశీలించారు. అనంతరం మాట్లాడారు. ఆయన వెంట డీసీఎస్‌ఓ కిరణ్‌కుమార్, తహసీల్దార్ విజయలక్ష్మి, ఆర్‌ఐ సంతోష్‌కుమార్, సివిల్ సప్లయీస్ ఆర్‌ఐ ఉన్నారు.
ధాన్యాన్ని మిల్లుకు తరలించాలి


