68 శాతం బొగ్గు ఉత్పత్తి
● ఏరియా జీఎం రాజేశ్వర్‌రెడ్డి
భూపాలపల్లి అర్బన్: నవంబర్ మాసంలో ఏరియాలో 68శాతం బొగ్గు ఉత్పత్తి సాధించినట్లు ఏరియా జీఎం రాజేశ్వర్‌రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకత, మట్టి వెలికితీత, రవాణా వివరాలు వెల్లడించారు. 2025–26 ఆర్థిక సంవత్సరం నవంబర్ మాసానికి సంబంధించి నిర్దేశించిన బొగ్గు ఉత్పతి లక్ష్యాలలో 4.45లక్షల టన్నులకు 3.02లక్షల టన్నులు సాధించినట్లు చెప్పారు. ఓబీ వెలికితీతలో 51.50 క్యుబిక్ మీటర్లగాను 37.69 క్యూబిక్ మీటర్లతో 73శాతం ఓవర్ బర్దన్ వెలికి తీసినట్లు చెప్పారు. ఏరియాలో ఈ నెలలో కొత్త జిమ్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో ఏరియాకు కేటాయించిన ఉత్పత్తి లక్ష్యాలు సాధించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో వార్షిక లక్ష్యాలు సాధించాలనే లక్ష్యంతో ముందుకు వెళుతున్నామని తెలిపారు.
రెండో రోజు 76 నామినేషన్లు
భూపాలపల్లి రూరల్: గ్రామపంచాయతీ రెండో విడత నామినేషన్ల ప్రక్రియలో భూపాలపల్లి మండలంలో రెండో రోజు సోమవారం సర్పంచ్‌లకు 36, వార్డు మెంబర్లకు 40 నామినేషన్లు దాఖలైనట్లు భూపాలపల్లి ఎంపీడీఓ తరుణి ప్రసాద్ తెలిపారు. నేడు (మంగళవారం) నామినేషన్లకు ఆఖరిరోజు కావడంతో ఎక్కువ సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది.


