5, 6 తేదీల్లో జిల్లా స్థాయి సైన్స్‌ఫెయిర్
భూపాలపల్లి అర్బన్: ఈ నెల 5, 6వ తేదీల్లో నిర్వహించనున్న జిల్లా స్థాయి సైన్స్‌ఫెయిర్‌ను విజయవంతం చేయాలని జిల్లా ఇన్‌చార్జ్ విద్యాశాఖ అధికారి రాజేందర్ కోరారు. శాంతినికేతన్ పాఠశాలలో రెండు రోజుల పాటు నిర్వహించే ఇన్‌స్పైర్ నిర్వహణకు సోమవారం పాఠశాల ఆవరణలో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ.. ఇన్‌స్పైర్ ప్రాజెక్ట్, ఎగ్జిబిట్స్ ప్రదర్శించాలన్నారు. మొత్తం ఏడు అంశాలలో జూనియర్, సీనియర్ విభాగాల్లో నమోదు చేయాలన్నారు. ఆయా కమిటీల కన్వీనర్లు, కో కన్వీనర్లు సమర్థవంతంగా పనిచేసి విజయవంతం చేయాలని చెప్పారు. ఈ సమావేశంలో జిల్లా సైన్స్ అధికారి బర్ల స్వామి, ఏఎంఓ పింగిలి విజయపాల్‌రెడ్డి, డీసీఈబీ కార్యదర్శి చంద్రశేఖర్, ఎంఈఓ దేవానాయక్, వివిధ మండలాల ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


