రాష్ట్ర స్థాయికి ఎంపిక
కాళేశ్వరం: మహదేవపూర్ మండలకేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలకు చెందిన వెలగందుల తరుణి 6వ తరగతి, వెలగందుల తణ్మయి 8వ తరగతి విద్యార్థులు వీవీఎం (విద్యార్థి విజ్ఞాన్ మంథన్) పరీక్షకు రాష్ట్రస్థాయి ఎంపికై నట్లు జిల్లా వీవీఎం కోఆర్డినేటర్, పాఠశాల ఫిజికల్ సైన్స్ టీచర్ మడక మధు ఆదివారం తెలిపారు. వచ్చే నెలలో హైదరాబాద్‌లో జరిగే రాష్ట్ర స్థాయి పరీక్షలో పాల్గొంటారని పేర్కొన్నారు. విద్యార్థులు రాష్ట్ర స్థాయికి ఎంపికై నందుకు పాఠశాల హెచ్‌ఎం జి.శ్రీనివాస్‌రెడ్డి, ఉపాధ్యాయ బృందం సరిత, సుధారాణి, సరితాదేవి, వలిపాషా, శ్రీనివాస్, రజిత, లీలారాణి, సమ్మయ్య, వీరేశం, దీపిక, వసుధప్రియా, ప్రసూనా, సాహెదాబేగం, పూర్ణిమ విద్యార్థులను అభినందించారు.
తరుణి తన్మయి
రాష్ట్ర స్థాయికి ఎంపిక


