కోలుకునేదెప్పుడో..? | - | Sakshi
Sakshi News home page

కోలుకునేదెప్పుడో..?

Dec 1 2025 9:28 AM | Updated on Dec 1 2025 9:28 AM

కోలుక

కోలుకునేదెప్పుడో..?

కౌలు రైతులను గుర్తించని ప్రభుత్వాలు

మల్హర్‌ మండలంలో కౌలు రైతు సాగు చేసిన మిర్చి పంట

అనేక పథకాలకు దూరం

ప్రతీ సీజన్‌లో నష్టాలపాలు

అప్పులతో సాగుతున్న వ్యవసాయం

కాటారం: సొంత భూమి లేక, వ్యవసాయం తప్ప మరోదారి లేక ఇతరుల భూమిని కౌలుకు తీసుకొని సాగు చేస్తున్న కౌలు రైతుల పరిస్థితి దయనీయంగా తయారైంది. వాతావరణ పరిస్థితులు, ప్రభుత్వ విధానాలతో దీర్ఘకాలంగా కన్నీళ్లే మిగులుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఆదుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ కౌలు రైతులపై దృష్టి సారించడం లేదు. దీంతో కౌలు రైతులు ప్రతీ ఏటా ఆర్థికంగా నష్టపోతూ కోలుకోలేని స్థితికి చేరుతున్నారు. కనీసం కౌలు రైతులు అధికారిక గుర్తింపునకు నోచుకోకపోవడంతో వారి పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది.

అన్ని పథకాలకు దూరమే..

కౌలు రైతులకు అధికారిక గుర్తింపు లేకపోవడంతో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు రైతుల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన ఏ పథకానికి కూడా వీరు అర్హత పొందలేకపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వంప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు భరోసా, రైతు బీమా వంటి పథకాలకు సైతం వీరు దూరం కావాల్సి వస్తుంది. దీనికి తోడు బ్యాంకు రుణాలు కూడా పొందలేక పోవడంతో వడ్డీ వ్యాపారుల వద్ద అడ్డగోలు వడ్డీకి తెచ్చుకొని కౌలు రైతులు చితికిపోతున్నారు.

పంట అమ్ముకోవాలన్నా తిప్పలే..

కౌలు రైతులు ఆరుగాలం శ్రమించి సాగు చేసిన పంటలను చివరకు అమ్ముకోవడానికి కూడా అష్టకష్టాలు పడుతున్నారు. ప్రస్తుతం పత్తి, వరి పంటలను కొనుగోలు చేయడానికి ప్రభుత్వం ద్వారా పత్తి సీసీఐ కేంద్రాలు, వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. పంట నమోదు ప్రకారం గతంలో ఏ భూ యజమాని ఎంత మేర ఏఏ పంటలు సాగు చేశారనేది వ్యవసాయశాఖ అధికారులు ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. భూ యజమాని పేరు మాత్రమే ఆన్‌లైన్‌లో నిక్షిప్తమై ఉంటుంది తప్ప క్షేత్ర స్థాయిలో పంట సాగు చేసే కౌలు రైతు పేరు ఎక్కడ కూడా నమోదు లేదు. దీంతో పంట విక్రయించే సమయంలో కౌలు రైతు భూమి కౌలుకు ఇచ్చిన యజమానిపై ఆధారపడాల్సి వస్తుంది. పంటను భూ యజమాని పేరు మీదనో లేక ఆయన భూ రికార్డుల ఆధారంగా వ్యవసాయశాఖ ద్వారా కౌలుపత్రం తీసుకొని కొనుగోలు కేంద్రాల్లో సమర్పించి అమ్ముకోవాల్సి వస్తుంది. పంట విక్రయించే విషయంలో కౌలు రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

ప్రభుత్వం నుంచి ఆదేశాలు లేవు..

కౌలు రైతుల గుర్తింపు కార్డుల జారీకి సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలూ లేవు. వ్యవసాయ శాఖ ద్వారా రైతులకు అన్ని రకాల ప్రోత్సాహం అందిస్తాం. వ్యవసాయశాఖ ద్వారా ప్రభుత్వం అందిస్తున్న సేవలను రైతులు వినియోగించుకోవాలి. – బాబురావు,

జిల్లా వ్యవసాయశాఖ అధికారి

కౌలు రైతులను గుర్తించాలి..

ప్రభుత్వం కౌలు రైతులను గుర్తించి వ్యవసాయం ప్రోత్సహించాలి. కౌలు రైతులకు ప్రత్యేక గుర్తింపుకార్డులు ఇవ్వాలి. వర్షాభావ పరిస్థితుల కారణంగా పంట నష్టపోయిన కౌలు రైతులకు పరిహారం అందించాలి. రైతు భరోసా అందించి ఆదుకోవాలి.

– సదయ్య, కౌలు రైతు, అంకుషాపూర్‌

అమలుకు నోచుకోని ప్రభుత్వ హామీ..

జిల్లాలో సుమారు 25వేల మందికి పైగానే కౌలు రైతులు ఉన్నారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ నాయకులు కౌలు రైతులను గుర్తిస్తామని హామీ ఇచ్చారు. రైతుల మాదిరిగానే ప్రాధాన్యత కల్పిస్తామని పథకాలు అందేలా ప్రత్యేక గుర్తింపు కల్పిస్తామని ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు నెరవేరలేదు. గతంలో కాంగ్రెస్‌ పార్టీ హయాంలో కౌలు రైతులకు రుణ అర్హత కార్డులు అందజేసి బ్యాంకు రుణాలు అందజేశారు. తర్వాత అధికారంలోకి వచ్చిన బీఆర్‌ఎస్‌తో పాటు ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం వీరిపై ఏ మాత్రం కరుణ చూపడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. బ్యాంకు రుణాలు అందక కౌలు రైతులు పెట్టుబడి కోసం ప్రైవేట్‌గా అప్పలు తెచ్చి వడ్డీలు కట్టలేక ఆర్థికంగా నష్టపోతున్నారు. కౌలు రైతులకు వ్యవసాయం తప్ప మరో దారి లేక పంట సాగులో నష్టాలు వచ్చినప్పటికీ కౌలు చెల్లించి వ్యవసాయన్నే కొనసాగిస్తున్నారు.

కోలుకునేదెప్పుడో..?1
1/3

కోలుకునేదెప్పుడో..?

కోలుకునేదెప్పుడో..?2
2/3

కోలుకునేదెప్పుడో..?

కోలుకునేదెప్పుడో..?3
3/3

కోలుకునేదెప్పుడో..?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement