నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి
● ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్
చిట్యాల: మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు తమ ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకోవాలని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ కోరారు. ఆదివారం మండలంలోని చల్లగరిగ, చిట్యాల గ్రామ పంచాయతీలలో ఏర్పాటుచేసి నామినేషన్ కేంద్రాలను సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించబడిన ప్రాంతాలలో భద్రతా ఏర్పాట్లు, బందోబస్తు విధులు, సిబ్బంది నిర్వహణను సమీక్షించి పలు సూచనలు అందించారు. పోలీస్‌శాఖ నుంచి ప్రజలకు అవసరమైన సేవలు అందిస్తామన్నారు. నిర్భయంగా, భయబ్రాంతులకు లోను కాకుండా తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఆయన వెంట సీఐ మల్లేష్, ఎస్సై శ్రావన్‌కుమార్, ఈశ్వరయ్య, పోలీస్ సిబ్బంది ఉన్నారు.


