ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు కృషి
● ఎన్నికల సాధారణ పరిశీలకుడు
ఫణీంద్ర రెడ్డి
రేగొండ: గ్రామపంచాయతీ ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని ఎన్నికల సాధారణ పరిశీలకుడు ఫణీంద్ర రెడ్డి అన్నారు. శనివారం రేగొండ, రంగయ్యపల్లి, దమ్మన్నపేటలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాలను సందర్శించారు. ఈ సందర్భంగా నామినేషన్ కేంద్రాలలో సౌకర్యాలను, నామినేషన్‌ల స్వీకరణ విధానాన్ని సమీక్షించారు. ఎంపీడీఓలు, తహసీల్దార్లు పోలింగ్ కేంద్రాల్లో కనీస సౌకర్యాలు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎన్నికలను శాంతియుతంగా, నిబంధనలకు లోబడి నిర్వహించేందుకు అన్ని శాఖలతో సమన్వయం చేసుకోవాలని అధికారులకు సూచించారు. అనంతరం రూపిరెడ్డిపల్లి వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్‌ను తనిఖీ చేసి ప్రతీ వాహనాన్ని నిశితంగా పరిశీలించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్వేత, ఎంపీడీఓ వెంకటేశ్వరరావు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
చెక్‌పోస్టుల తనిఖీ
మొగుళ్లపల్లి: గ్రామ పంచాయతీ ఎన్నికలను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలని సాధారణ ఎన్నికల పరిశీలకులు ఫణీంద్రరెడ్డి అన్నారు. శనివారం మండలంలోని రంగాపురం ప్రభుత్వ పాఠశాలలో పోలింగ్ కేంద్రంతో పాటు మొగుళ్లపల్లి, రంగాపూర్ చెక్‌పోస్టులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. నామినేషన్ స్వీకరణ విధానాన్ని సమీక్షించారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు కృషి


