కేసీఆర్ సంకల్ప బలంతోనే తెలంగాణ
● మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
భూపాలపల్లి అర్బన్: గాంధీ చూపిన మార్గంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ సంకల్ప బలంతో సాధించుకున్నామని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి తెలిపారు. బీఆర్‌ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు కటకం జనార్దన్ అధ్యక్షతన శనివారం బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన దీక్ష దివస్ కార్యక్రమానికి గండ్ర వెంకటరమణారెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి హాజరయ్యారు. దీక్షా దివస్ ఫొటో గ్యాలరీని నాయకులు, కార్యకర్తలతో కలిసి వీక్షించారు. ఈ సందర్భంగా వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ.. 2009 నవంబర్ 29న మహానేత కేసీఆర్ దీక్షా దివస్ పేరుతో చేసిన నిరవధిక నిరాహార దీక్షతోనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చిందన్నారు. అనంతరం జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో రోగులకు గండ్ర జ్యోతి పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంఽథాలయ సంస్థ మాజీ చైర్మన్ బుర్ర రమేష్, పీఏసీఎస్ చైర్మన్ మేకల సంపత్‌కుమార్, నాయకులు సెగ్గం వెంకటరాణిసిద్దు, గండ్ర హరీశ్‌రెడ్డి, రాజిరెడ్డి, బడితెల సమ్మయ్య పాల్గొన్నారు.


