10గంటల తర్వాతే..
8.45 గంటల నుంచి ఓపీ కోసం లైన్‌లో నిల్చున్న రోగులు
భూపాలపల్లి అర్బన్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించడం లేదు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు ఓపీ నిర్వహించాల్సి ఉంటుంది. 9గంటలకు ప్రారంభం కావాల్సిన ఓపీ సేవలు 10గంటలు దాటితేకాని ప్రారంభంకావడం లేదు. అనా రోగ్య సమస్యలతో బాధపడుతూ ఆస్పత్రికి రోగులు ఉదయం 8.30గంటల నుంచే వస్తున్నారు. ఓపీ లైన్ వద్ద బారులు దీరుతున్నారు. నిల్చోని అలసిపోయి నేలపైనే కూర్చుంటున్నారు. కనీసం కూర్చోవడానికి కుర్చీలు కూడా లేని పరిస్థితి. శుక్రవారం ‘సాక్షి’ ఆస్పత్రిని పరిశీలించింది. ఉదయం 9.22 గంటలకు ఫార్మసీ తెరిచారు. 9.39 గంటలకు ఓపీ రిజిస్ట్రేషన్, 9.30 గైనకాలజీ సేవలు, 9.40గంటలకు ఎస్‌ఆర్‌లు ఓపీ సేవలు ప్రారంభించారు. 10గంటల తరువాత పలు విభాగాలు అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్లు ఆస్పత్రికి చేరుకొని మెడికల్ కళాశాలలో సమావేశం ఉందని వెళ్లిపోయారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ శుక్రవారం సెలువులో ఉన్నట్లు తెలిసింది. బాధితులు దూర ప్రాంతాల నుంచి వచ్చి ఆస్పత్రిలో వైద్యుల కోసం గంటల తరబడి వేచిచూడాల్సిన పరిస్థితులు దాపురించాయి. వైద్యులు సమయపాలన పా టించడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నారు.
ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో
ఇష్టారాజ్యం
8.30గంటల నుంచి క్యూలో రోగులు..
10గంటల తర్వాతే..
10గంటల తర్వాతే..
10గంటల తర్వాతే..
10గంటల తర్వాతే..
10గంటల తర్వాతే..


