రెండో రోజు 161 నామినేషన్లు | - | Sakshi
Sakshi News home page

రెండో రోజు 161 నామినేషన్లు

Nov 29 2025 6:59 AM | Updated on Nov 29 2025 6:59 AM

రెండో

రెండో రోజు 161 నామినేషన్లు

సర్పంచ్‌లకు 48.. వార్డులకు 113

నేడు చివరి రోజు

భూపాలపల్లి అర్బన్‌: జిల్లాలో మొదటి విడత ఎన్నికలు జరిగే నాలుగు మండలాల నుంచి శుక్రవారం 161 నామినేషన్లు దాఖలైనట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ రాహుల్‌శర్మ తెలిపారు. సర్పంచ్‌లకు 48, వార్డు సభ్యులకు 113 నామినేషన్లు దాఖలు చేశారు. నేటితో (శనివారం) మొదటి విడత నామినేషన్ల గడువు ముగియనుంది. నేడు భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేసే అవకాశాలు ఉన్నా యి. రెండు రోజుల్లో సర్పంచ్‌లకు 93, వార్డు సభ్యులకు 148 నామినేషన్లు మాత్రమే దాఖలయ్యాయి. గణపురం మండలంలో సర్పంచ్‌కు 14, వార్డులకు 14, కొత్తపల్లిగోరిలో సర్పంచ్‌కు 13, వార్డులకు 28, మొగుళ్లపల్లిలో సర్పంచ్‌ 37, వార్డులకు 85, రేగొండలో సర్పంచ్‌కు 29, వార్డులకు 21 నామినేషన్లు దాఖలయ్యాయి.

కోటగుళ్లను సందర్శించిన అమెరికా దేశస్తుడు

గణపురం: మండలకేంద్రంలోని కాకతీయుల కళాక్షేత్రం కోటగుళ్లను అమెరికా దేశానికి చెందిన స్టర్ట్‌ ఫ్రీమాన్‌ శుక్రవారం సందర్శించారు. భారతదేశంలోని పర్యాటక ప్రాంతాలను సందర్శించడంలో భాగంగా కోటగుళ్లను సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ శిల్ప సంపద అద్భుతంగా ఉందని కొనియాడారు. ఆయన తనవెంట తెచ్చుకున్న కెమెరాలలో ఆలయ శిల్ప సంపదను చిత్రీకరించుకున్నారు.

పూలేకు నివాళి

భూపాలపల్లి రూరల్‌: పూలే వర్ధంతిని పురస్కరించుకొని పట్టణంలోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద జ్యోతిరావు పూలే చిత్రపటానికి వివిధ సంఘాల నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు తాటి కంట రవికుమార్‌, ఎస్సీ, ఎస్టీ, బీసీ కోఆర్డినేటర్‌ కొత్తూరు రవీందర్‌, బీసీ జేఏసీ చైర్మన్‌ పైడిపల్లి రమేష్‌, భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి దొంగల రాజేందర్‌, భూపాలపల్లి పట్టణ అధ్యక్షుడు గీసా సంపత్‌, బీసీ రాజ్యాధికార సమితి జిల్లా అధ్యక్షుడు గట్ల రాజయ్య పాల్గొన్నారు.

పెరిక సంఘం జిల్లా

అధ్యక్షుడిగా రవీందర్‌

భూపాలపల్లి రూరల్‌: పెరిక కుల సంఘం జిల్లా అధ్యక్షుడిగా సూరం రవీందర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ గటిక విజయ్‌కుమార్‌ తెలిపారు. శుక్రవారం జిల్లాకేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కమిటీ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికై న రవీందర్‌ను సన్మానించారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యనిర్వాహన కార్యదర్శి కేతే విజయ్‌కుమార్‌, చింతం సదానందం, సంఘం నాయకులు పాల్గొన్నారు.

శాసీ్త్రయ వైఖరిని

పెంపొందించాలి

భూపాలపల్లి అర్బన్‌: విద్యార్థులలో శాసీ్త్రయ వైఖరిని పెంపొందించాలని జిల్లా సైన్స్‌ అధికారి బర్ల స్వామి సూచించారు. జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో జిల్లాస్థాయి ప్రతిభ పాటల, చెకుముకి పోటీలు జిల్లాకేంద్రంలోని మాంటిసోరి పాఠశాలలో శుక్రవారం నిర్వహించారు. జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షుడు పొగాకుల రాధాకృష్ణ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి బర్ల స్వామి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. నిత్యజీవితంలో సైన్స్‌ పట్ల ప్రతి ఒక్కరూ మక్కువ పెంచుకోవాలన్నారు. విద్యార్థులు కష్టపడి చదివి భావి శాస్త్రవేత్తలుగా ఎదగాలని, జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ప్రతి ఏటా విద్యార్థుల్లో సైన్స్‌ పట్ల ఉన్న అభిరుచిని పెంచడానికి మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించడం అభినందనీయమని చెప్పారు. జిల్లాస్థాయిలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మహాముత్తారం ఇన్‌చార్జ్‌ ఎంఈఓ రవీందర్‌రెడ్డి, పాఠశాల వైస్‌ ప్రిన్సిపాల్‌ సీన్‌ జోన్స్‌, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

రెండో రోజు  161 నామినేషన్లు 
1
1/3

రెండో రోజు 161 నామినేషన్లు

రెండో రోజు  161 నామినేషన్లు 
2
2/3

రెండో రోజు 161 నామినేషన్లు

రెండో రోజు  161 నామినేషన్లు 
3
3/3

రెండో రోజు 161 నామినేషన్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement