నామినేషన్ కేంద్రాల పరిశీలన
గణపురం: మండలకేంద్రంలోని పలు నామినేషన్ కేంద్రాలను ఎన్నికల సాధారణ పరిశీలకులు, టీసీఎంఎస్‌ఐడీసీ మేనిజింగ్ డైరెక్టర్ ఫణీంద్ర రెడ్డి, ఎస్పీ సంకీర్త్ వేర్వేరుగా పరిశీలించారు. గాంధీనగర్, మైలారం గ్రామంలోని నామినేషన్ కేంద్రాలను ఫణీంద్ర రెడ్డి పరిశిలీంచగా.. గాంధీనగర్, గణపురం ఎన్నికల నామినేషన్ కేంద్రాన్ని ఎస్పీ సంకీర్త్ పరిశీలించి సంబంధిత అదికారులకు పలు సూచనలు చేశారు.
ఎన్నికలు శాంతియుతంగా జరిగేలా చూడాలి
రేగొండ: గ్రామపంచాయతీ ఎన్నికలు శాంతియుతంగా జరిగేలా సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ అన్నారు. శుక్రవారం మండలంలో ఏర్పాటు చేసిన ఎన్నికల చెక్‌పోస్ట్‌తో పాటు నామినేషన్ కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చెక్‌పోస్ట్‌ల వద్ద నిరంతరం అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి అక్రమ నగదు, మద్యం అరికట్టాలని సూచించారు. నామినేషన్ కేంద్రాల వద్ద శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడితే వారిపై ఎన్నికల నియమావళి ప్రకారం చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఎస్పీ వెంట సీఐ కరుణాకర్, ఎస్సై రాజేష్ ఉన్నారు.
నామినేషన్ కేంద్రాల పరిశీలన


