నిబంధనలు పాటించాలి
రేగొండ: ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల సంఘం నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని కలెక్టర్ రాహుల్‌శర్మ అన్నారు. శుక్రవారం రేగొండ, గూడెపల్లి గ్రామపంచాయతీలలో నామినేషన్ కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నామినేషన్ల ప్రక్రియ సజావుగా సాగేందుకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని సూచించారు. నామినేషన్ కేంద్రాల వద్ద శాంతియుత వాతావరణం ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. నామినేషన్లకు శనివారం చివరి రోజు కావడంతో అభ్యర్థులు అధిక సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేసే అవకాశం ఉండటంతో తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్వేత, ఎంపీడీఓ వెంకటేశ్వరరావు, పీఆర్ డీఈ రవికుమార్, ఇరిగేషన్ డీఈ గిరిధర్ పాల్గొన్నారు.
బ్యాంకు ఖాతాలు అందించాలి
భూపాలపల్లి అర్బన్: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల వ్యయ వివరాల కోసం బ్యాంకు ఖాతా ప్రారంభించడంలో ఆలస్యం కాకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్‌శర్మ బ్యాంకర్లను ఒక ప్రకటనలో ఆదేశించారు. జాప్యానికి అవకాశం లేకుండా బ్యాంకర్లు సహకరించాలన్నారు.
కలెక్టర్ రాహుల్‌శర్మ


