భూపాలపల్లి: రోడ్డెక్కాలంటే భయమేస్తుంది. ప్ర ధాన రహదారులతో పాటు చిన్నచిన్న వీధుల్లో సై తం శునకాలు గుంపులు గుంపులుగా తిరుగుతూ మనుషులపై దాడులకు పాల్పడుతున్నాయి. తప్పి ంచుకునేంత సమయం కూడా ఇవ్వకుండా రోడ్డు మీద పడేసి పదుల సంఖ్యలో దాడులకు పాల్పడి కండలు పీకుతున్నాయి. దీంతో మహిళలు, చిన్న పి ల్లలు, వృద్ధులు భయాందోళనకు గురవుతున్నారు.
పదుల సంఖ్యలో తిరుగుతూ..
భూపాలపల్లి పట్టణంతో పాటు మండలాల్లోని గ్రామాల్లో కూడళ్ల వద్ద శునకాల స్వైర విహారం ఎక్కువైంది. కుక్కలను నియంత్రించేందుకు అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో ఒక్కో గ్రామంలో వందకు పైగా విచ్చలవిడిగా తిరుగుతూ ప్రజలపై దాడులకు పాల్పడుతున్నాయి. పాఠశాలకు వెళ్లే విద్యార్థులు, టిఫిన్ బాక్సులు తీసుకొని కూలీ పనులకు వెళ్లే వృద్ధులు, మహిళలపై నిత్యం దాడులు చేస్తున్నాయి. బైక్‌లపై వెళ్తున్న సమయంలో వెంబడిస్తూ కరిచేందుకు ప్రయత్నిస్తుండటంతో వాహనదారులు అదుపుతప్పి కిందపడి గాయాలపాలవుతున్న పరిస్థితి నెలకొంది. జిల్లాలో నెలకు 200కు పైగా కేసులు నమోదు అవుతున్నప్పటికీ పంచాయతీ, మున్సిపల్ శాఖల అధికారులు తగు చర్యలు తీసుకోకపోవడంతో ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
కుక్కలకు వింత వ్యాధులు..
జిల్లాలోని కుక్కలు వివిధ రకాల వ్యాధుల బారిన పడుతున్నాయి. శరీరంపై చర్మం ఊడిపోయి రక్తం కారడం, నోటి నుంచి నురుగు రావడం, బక్కచిక్కిపోవడం తదితర లక్షణాలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తా, గణేష్ చౌక్‌లోని చికెన్, మటన్ సెంటర్‌ల వద్ద కనిపించే కుక్కలు వింత రోగాల బారిన పడి భయానకంగా కనిపిస్తున్నాయి. దీంతో ప్రజలు వాటిని చూసి భయాందోళనకు గురవుతున్నారు.
చర్యలు తీసుకుంటాం..
మున్సిపాలిటీ పరిధిలో త్వరలోనే కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకుంటాం. ఇటీవలే టెండర్లను ఆహ్వానించాం. వారం రోజుల్లో ప్రక్రియ ముగుస్తోంది. టెండరు దక్కించుకున్న వారు ప్రత్యేక వాహనంలో శునకాలను ఏబీసీ సెంటర్‌కు తరలించి స్టెరిలైజేషన్, శస్త్ర చికిత్స చేసి, ఐ దు రోజుల పాటు అబ్జర్వేషన్‌లో ఉంచి ఫీడింగ్ ఇస్తారు. అనంతరం యాంటి రెబీస్ వ్యాక్సిన్ ఇ చ్చాక తీసుకొచ్చిన ప్రాంతంలోనే వదిలేస్తారు. – బిర్రు శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్