
విద్యార్థులతో జాగ్రత్తగా వ్యవహరించాలి
కాటారం: గురుకులం, ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాల్లో ఉండే విద్యార్థులతో ఉపాధ్యాయులు, సి బ్బంది జాగ్రత్తగా వ్యవహరించాలని జిల్లా అదనపు కలెక్టర్ విజయలక్ష్మి సూచించారు. కాటారం మండల కేంద్రంలోని గిరిజన గురుకుల బాలిక కళాశాలను బుధవారం తనిఖీ చేశారు. కళాశాల పరిసరా లు, తరగతి గదులు, డార్మెటరీ, కిచెన్, డైనింగ్ రూం, స్టాక్ రికార్డులు, ఉపాధ్యాయుల, విద్యార్థుల హాజరు పట్టికలను పరిశీలించారు. కూరగాయలు, వంటసామగ్రి నాణ్యతను పరిశీలించారు. అనంత రం విద్యార్థులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్ర ద్ధ చూపాలని ప్రిన్సిపాల్ నాగలక్ష్మిని ఆదేశించారు. మెనూ ప్రకారం భోజనం అందించాలన్నారు. విద్యార్థులతో కలిసి అడిషనల్ కలెక్టర్ భోజనం చేసి రుచిని పరిశీలించారు. అడిషనల్ కలెక్టర్ వెంట ఎంపీడీఓ బాబు, ఎంపీఓ వీరస్వామి, పంచాయతీ కార్యదర్శి షగీర్‌ఖాన్, సిబ్బంది ఉన్నారు.