
జీపీఓలు వచ్చేస్తున్నారు..
భూపాలపల్లి: జిల్లాలోని 12 మండలాలకు గ్రామ పాలనాధికారులు (జీపీఓలు) రానున్నారు. గతంలో వీఆర్‌ఓ, వీఆర్‌ఏలుగా పని చేసి ప్రస్తుతం వివిధ ప్రభుత్వ శాఖల్లో జూనియర్ అసిస్టెంట్లుగా పని చేస్తున్న వారు తిరిగి సొంత రెవెన్యూశాఖలోకి రెండు, మూడు రోజుల్లో రానున్నారు. జిల్లా వ్యాప్తంగా 107 మంది జీపీఓలుగా ఎంపిక కాగా 100 మంది బుధవారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన కౌన్సెలింగ్‌కు హాజరయ్యారు. వీరికి జిల్లాలోని 12 మండలాల పరిధిలో క్లస్టర్ల వారీగా, అభ్యర్థులు ఇచ్చిన ఐచ్చిక మేరకు ఓపెన్ కౌన్సెలింగ్ నిర్వహించి క్లస్టర్ కేటాయించారు. ఈ సందర్భంగా గ్రామ పాలన అధికారులు పారదర్శకత, జవాబుదారీతనం, ప్రజా సంక్షేమ కార్యక్రమాల అమలులో కీలక పాత్ర పోషించాలని అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్ సూచించారు. ప్రజల సమస్యలను గ్రామ స్థాయిలోనే పరిష్కరించి, గ్రామీణాభివృద్ధి దిశగా కృషి చేయాలన్నారు. కలెక్టరేట్ ఏఓ మురళీధర్‌రావు, సిబ్బంది పాల్గొన్నారు.
జిల్లాకు 107 మంది ఎంపిక