
ఐలమ్మ జీవితం స్ఫూర్తిదాయకం
భూపాలపల్లి: సమాజంలో అన్యాయం, అణచివేతలకు వ్యతిరేకంగా పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మ జీవితం నేటి తరాలకు స్ఫూర్తిదాయకమని కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. చాకలి ఐలమ్మ 40వ వర్ధంతి సందర్భంగా బుధవారం ఐడీఓసీ కార్యాలయంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. వివిధ కుల సంఘాల ప్రతినిధులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి, ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్, బీసీ సంక్షేమశాఖ అధికారి ఇందిర, జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
నిర్మాణ పనులు వేగిరం చేయాలి..
జిల్లాలో అంగన్‌వాడీ కేంద్రాలు, గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణ పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. బుధవారం ఐడీఓసీ కార్యాలయంలో రెవెన్యూ, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్, మహిళా సంక్షేమ, డీపీవో, డీఆర్‌డీఓ, టీడబ్ల్యూ ఐడీసీలతో అంగన్‌వాడీ కేంద్రాలు, గ్రామ పంచాయతీ భ వనాల నిర్మాణ ప్రగతిపై కలెక్టర్ సమీక్షించారు. భవనాల నిర్మాణంలో లోపాలు లేకుండా నా ణ్యతతోపాటు వేగం పెంచాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు అశోక్‌కుమార్, విజయలక్ష్మి, జిల్లా అధికారులు, ఇంజనీరింగ్ విభాగాల అధికారులు పాల్గొన్నారు.
శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి..
మహిళలు వ్యాపార సృజనాత్మకత, నైపుణ్యాభివృద్ధి, పారిశ్రామికతపై అవగాహన కల్పించడంతో పాటు, వ్యాపార విస్తరణకు అవసరమైన శిక్షణ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. బుధవారం ఐడీఓసీ కార్యాలయ సమావేశపు హాల్‌లో ర్యాంప్, డీఆర్‌డీఓ, పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వ్యాపార నైపుణ్య అవగహన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌డీఓ బాలకృష్ణ, పరిశ్రమల శాఖ జీఎం సిద్ధార్థ, వీహబ్ డైరెక్టర్ జావిద్ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ రాహుల్ శర్మ