
భావ ప్రకటన స్వేచ్ఛకు సంకెళ్లు సరికాదు!
ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం వచ్చాక పత్రికా స్వేచ్ఛ, ప్రశ్నించే గొంతుకలను భౌతికదాడులతో పాటు పోలీసులను ఉపయోగిస్తూ తప్పుడు కేసులతో తీవ్ర అణచివేతకు గురిచేస్తుండడంపై పాత్రికేయులు, పాత్రికేయ సంఘాలు మండిపడుతున్నాయి. ప్రజా సమస్యలపై కథనాలు ప్రచురిస్తే సాక్షి దినపత్రిక జర్నలిస్టులపై కొందరు ప్రభుత్వ ఉద్యోగులతో ఫిర్యాదులు ఇప్పిస్తూ కేసులు నమోదు చేస్తుండడాన్ని ఖండించారు. వివిధ అంశాలపై ప్రతిపక్ష పార్టీల నాయకులు ఏర్పాటు చేసే ప్రెస్‌కాన్ఫరెన్స్‌ల వార్తలు రాసిన సందర్భంలోనూ సాక్షి దినపత్రికతో పాటు ఎడిటర్, ఇతర జర్నలిస్టులపై తప్పుడు కేసులు నమోదు చేస్తూ రాజ్యాంగం ప్రసాదించిన భావ ప్రకటన స్వేచ్ఛను పూర్తిగా తమ గుప్పిట్లోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. – హన్మకొండ