
4.36 ఎకరాల స్థలం కేటాయింపు
కాళేశ్వరం: ఈ ఏడాది జనవరిలో రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం ఆర్టీసీ కొత్త బస్టాండ్ నిర్మాణం కోసం రూ.3.95కోట్ల నిధులు మంజూరు చేయగా, ప్రభుత్వ స్థలం లేకపోవడంతో జాప్యం జరిగింది. దీంతో రాష్ట్ర ఐటీశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రత్యేక దృష్టిసారించడంతో కలెక్టర్ రాహుల్‌శర్మ ఆదేశాలతో రెవెన్యూశాఖ ప్రభుత్వ స్థలాలపై కసరత్తు చేసింది. గురువారం కాళేశ్వరంలోని హనుమాన్‌నగర్(కొత్త బస్టాండ్) ఏరియాలో 4.36ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని మహదేవపూర్ తహసీల్దార్ రామారావు, డీటీ కృష్ణ, సర్వేయర్ రమేష్ సర్వేచేసి భూపాలపల్లి ఆర్టీసీ డీఎం ఇందు, ఆర్టీసీ ఈఈ సింగ్‌లకు కేటాయింపు పత్రాన్ని అందజేశారు. త్వరలో అత్యాధునిక హంగులతో బస్టాండ్ నిర్మాణం కానుంది. వారి వెంట ఆర్‌ఐ జగన్‌మోహన్‌రెడ్డి, సీనియన్ అసిస్టెంట్ రఘు, ఎస్సై తమాషారెడ్డి, కార్యదర్శి సత్యనారాయణ, గ్రామస్తులు జానీ, కిరణ్, రాజయ్య పాల్గొన్నారు.
అతి త్వరలో నిర్మాణం..
కొన్ని రోజులుగా స్థలంలేక నిర్మాణం జరుగలేదని, అతి త్వరలో బస్టాండ్ నిర్మాణం ప్రారంభమవుతుందని భూపాలపల్లి ఆర్టీసీ డిపో మేనేజర్ ఇందు తెలిపారు. కాళేశ్వరాలయానికి వచ్చే భక్తులకు, ఇతర రాష్ట్రాలకు తరలిపోయే ప్రయాణికులకు కాళేశ్వరం కూడలిగా ఉంటుందని పేర్కొన్నారు.
కాళేశ్వరం బస్టాండ్‌కు
రూ.3.95కోట్లు మంజూరు
అతి త్వరలో నిర్మాణం ప్రారంభం : డీఎం ఇందు