
నిర్మాణ పనుల తనిఖీ
భూపాలపల్లి అర్బన్: మున్సిపాలిటీ పరిధిలోని పలు నిర్మాణ పనులను మున్సిపల్ స్పెషల్ అధికారిణి, ఇన్‌చార్జ్ అదనపు కలెక్టర్ విజయలక్ష్మి బుధవారం పరిశీలించారు. సుభాష్‌కాలనీలో నిర్మిస్తున్న మినీ స్టేడియం, అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్, ప్రధాన రహదారిపై వాటర్ లీకేజీ పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో టౌన్ ప్లానింగ్ అధికారి సునీల్‌కుమార్, అసిస్టెంట్ ఇంజనీర్ మానస, సిబ్బంది పాల్గొన్నారు.
భూపాలపల్లి అర్బన్: సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో సింగరేణి ఉద్యోగ కుటుంబ స భ్యులు, ప్రభావిత గ్రామాల ప్రజలకు వృత్తి వి ద్యా కోర్సులపై శిక్షణ ఇవ్వనున్నట్లు ఏరియా అధికార ప్రతినిధి మారుతి ప్రకటనలో పేర్కొన్నారు. కంప్యూటర్ (డీటీపీ), మగ్గం వర్క్, స్పోకెన్ ఇంగ్లిష్, ఫొటో షాప్, జ్యూట్ బ్యాగ్ తయారీ, టైలరింగ్ కోర్సులపై శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. అర్హత కలిగిన మహిళలు ధ్రువీకరణ పత్రాలతో ఈ నెల 29వ తేదీలో జీఎం కార్యాలయంలో పర్సునల్ విభాగంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎస్సెస్సీ మెమో, ఆధార్‌కార్డు, ఉద్యోగి ఐడీ కార్డు, పాస్ ఫొటోలు, కుల ధ్రువీకరణ పత్రాలు రెండు సెట్లు అందించాలన్నారు.
కాళేశ్వరం: ప్రతీఒక్కరు రాజీవ్ ఆరోగ్యశ్రీ సేవలను వినియోగించుకోవాలని టీం లీడర్ అనిల్ అన్నారు. బుధవారం మహదేవపూర్ మండల కేంద్రంలోని సీహెచ్‌సీని ఆరోగ్య శ్రీ జిల్లా కోఆర్డినేటర్, డాక్టర్ నిఖిల్ స్వరూప్, మేనేజర్ విక్రమ్ ఆదేశాల మేరకు ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా డయాలసిస్ సెంటర్‌ను ఆస్పత్రి సూపరింటెండెంట్ విద్యావతితో కలిసి చూశారు. రోగులకు అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. అలాగే పలు రికార్డులను పరిశీలించారు. చికిత్స అందించడంలో సమస్యలు ఉంటే తెలపాలని రోగులను కోరారు. ఆయన వెంట ఆరోగ్యమిత్రలు సంతోష్, రాము తదితరులు ఉన్నారు.
భూపాలపల్లి రూరల్: నేడు భూపాలపల్లి బస్టాండ్ రోడ్ నుంచి 5 ఇంకై ్లన్ మధ్యలో 33 కేవీ లైన్ పనులు చేస్తున్నందున ఉదయం 8 నుంచి 10 గంటల వరకు విద్యుత్ అంతరాయం ఉంటుందని ఏఈ విశ్వాస్‌రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పట్టణంలోని రెడ్డికాలనీ, రాంనగర్, సుభాష్ కాలనీ, ఎల్‌బీనగర్, లక్ష్మినగర్, బానోతు వీధి, బస్టాండ్ నుంచి ఓసి–2 రోడ్, పాత జంగేడు రోడ్ పరిధిలో విద్యుత్ అంతరాయం ఉంటుందని, విద్యుత్ వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.
భూపాలపల్లి అర్బన్: జాతీయ మానవ హక్కుల కమిటీ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) జిల్లా అధ్యక్షుడిగా తాటికంటి రవికుమార్‌ను నియమించినట్లు రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ మొగుళ్ల భద్రయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోట రాజయ్యలు తెలిపారు. జిల్లా కేంద్రంలో బుధవారం ఏర్పాటు చేసిన జిల్లా కమిటీ సమావేశంలో నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షులుగా సంగెం రాజేందర్, నాంపల్లి వీరేశం, ప్రధాన కార్యదర్శిగా వేల్పుల మహేందర్, సంయుక్త కార్యదర్శిగా మేరుగు సురేష్, ప్రచార కార్యదర్శిగా ముక్తేశ్వర్, అధికార ప్రతినిధిగా జోగుల సంపత్, పట్టణ అధ్యక్షుడిగా ఇప్పకాయల రాధాకృష్ణ, రాష్ట్ర ఈసీ మెంబర్‌గా దుండ్ర కుమార్‌యాదవ్‌లను నియమించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికై న జిల్లా అధ్యక్షుడు రవికుమార్‌ను రాష్ట్ర నాయకులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాకేష్, అశోక్, కిరణ్, గట్టయ్య, చారి తదితరులు పాల్గొన్నారు.