
ఉత్తమ ఫలితాలు సాధించాలి
గణపురం: విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలని కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. బుధవారం గణపురం మండలంలోని గాంధీనగర్ జ్యోతి బా పూలే బాలికల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం విద్యార్థుల హాజరు, పాఠ్యంశాలపై అవగాహన, భోజన సౌకర్యాలపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యాభోదనతో పాటు పలు వసతులను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల సౌకర్యాలను మరింత మెరుగు పరిచేందుకు ప్రహరీ గోడ నిర్మాణం, డ్యూయల్ డెస్క్‌ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. విద్యార్ధులకు మెరుగైన విద్యను అందించి వారి భవిష్యత్‌కు పునాదులు వేయాలన్నారు. విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లోనూ రాణించాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి కుమారస్వామి, తహసీల్ధార్ సత్యనారాయణ స్వామి, ఎంపీడీఓ భాస్కర్, ఎస్‌ఓ స్వప్నారెడ్డి , సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ రాహుల్ శర్మ