
ఏజెన్సీ విద్యపై దృష్టి సారించాలని వినతి
వెంకటాపురం(కె): ఏజెన్సీ మండలాల్లో విద్యా వ్యవస్థపై అధికారులు దృష్టి సారించాలని కోరుతూ బు ధవారం ఆదివాసీ నవ నిర్మాణ సేన ఆధ్వర్యంలో జి ల్లా విద్యాశాఖ అధికారి సిద్దార్ధరెడ్డికి వినతి ప్రతం అందజేశారు. ఈ సందర్భంగా ఆదివాసీ నవ నిర్మాణ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు కోర్స నర్సింహమూర్తి మాట్లాడుతూ వెంకటాపురం, వాజేడు మండలాల్లో విద్యా వ్యవస్థ నిర్వీర్యం అవుతుందన్నారు. విద్యార్థులు వందల సంఖ్యలో ఉంటే ఉపాధ్యాయులు మాత్రం ఒక్కరే ఉంటున్నారని తెలిపారు. విద్యాహక్కు చట్టం ప్రకారం 11 మంది విద్యార్ధులకు ఒ క్క ఉపాధ్యాయుడు ఉండాల్సి ఉండగా 30 శాతం ఏకోపాధ్యాయ పాఠశాలలే ఉన్నాయని తెలిపారు. ఏకోపాధ్యాయ పాఠశాలలు కేవలం కేర్ టేకింగ్ స్కూల్స్‌గానే నడుస్తున్నాయని తెలిపారు. విద్యాబోదన సరిగా ఉండడం లేదన్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి దృష్టి సారించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాయం అజయ్, ఉయిక మహేష్ తదితరులు పాల్గొన్నారు.