
గని ఆవరణల్లోకి అనుమతించొద్దు
భూపాలపల్లి అర్బన్: సీఐటీయూ తలపెట్టిన బ్యాలెట్ ఓటింగ్‌కు గని ఆవరణల్లోకి అనుమతి లేదని.. ఎవరినీ రానివ్వవద్దని ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు. ఏరియా టార్గెట్ కమిటీ సమావేశం నిర్వహించారు. జీఎం మంగళవారం తన కార్యాలయంలో అన్ని గనుల మేనేజర్, సంక్షేమ అధికారులతో సమావేశం నిర్వహించారు. అన్ని బొగ్గు గనుల బొగ్గు ఉత్పత్తి ఉత్పాదకతలను అడిగి తెలుసుకున్నారు. గనుల్లో ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. కార్మిక సంఘం తలపెట్టిన పోల్‌ను గనుల లోపలకి ఎవరినీ అనుతించవద్దని అధికారులకు సూచించారు.