కాళోజీ రచనలు సమాజానికి మార్గదర్శకం | - | Sakshi
Sakshi News home page

కాళోజీ రచనలు సమాజానికి మార్గదర్శకం

Sep 10 2025 2:10 AM | Updated on Sep 10 2025 2:10 AM

కాళోజీ రచనలు సమాజానికి మార్గదర్శకం

కాళోజీ రచనలు సమాజానికి మార్గదర్శకం

భూపాలపల్లి అర్బన్‌: కాళోజీ రచనలలో ప్రజల బాధ, నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా రాసిన రచనలు సమాజానికి మార్గదర్శకంగా పనిచేస్తామని ఏరియా సింగరేణి జనరల్‌ మేనేజర్‌ రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు. కాళోజీ నారాయణరావు జయంతి (తెలంగాణ భాషా దినోత్సవం) వేడుకలను జీఎం కార్యాలయంలో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ.. కాళోజీ రచనలు వారి ఆవేదనలతో నిండిన కవి స్వరాల తెలంగాణ ప్రజల మనసుకు హత్తుకునేలా చేశాయన్నారు. కాళోజీ జీవితాన్ని ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అఽధికారులు అధికారులు పోషమల్లు, మారుతి, రాజు, శ్రావణ్‌కుమార్‌, ప్రదీప్‌, నరేశ్‌, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement