
సాహితీ కళాభవన్ ఏర్పాటుకు కృషి
భూపాలపల్లి అర్బన్: సాహితీవేత్తల కోరిక మేరకు జిల్లాలో సాహితీ కళా భవన్ ఏర్పాటుకు కృషి చేస్తానని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు తెలిపారు. కాళోజీ జయంతిని పురస్కరించుకొని జయశంకర్ సారస్వతి సమితి ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా కేంద్రంలో తెలుగు భాషా దినోత్సవాన్ని గడ్డం లక్ష్మయ్య అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ హాజరై మాట్లాడారు. మరుగునపడుతున్న కలలను బతికిస్తున్న కవులు, రచయితలందరికీ తన సంపూర్ణ సహకారం ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా సాహితీవేత్తలను ఎమ్మెల్యే ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మహాముత్తారం ఎంఈఓ రవీందర్‌రెడ్డి, జయశంకర్ సారస్వతి సమితి ప్రతినిధులు సంజీవరావు, నల్లగొండ సురేష్, రమేశ్ చంద్ర, భుజేంద్రచారి, పుల్లూరి నాగేశ్వర్, జ్యోతి, సునీల్, స్థానిక ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, కవులు, రచయితలు, భాషాభిమానులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు