
వేధింపులకు భయపడొద్దు
భూపాలపల్లి అర్బన్: లైంగిక వేధింపులకు గురైనప్పుడు మౌనం వహించాల్సిన అవసరం లేదని భూపాలపల్లి అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి అఖిల తెలిపారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ, జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహిళల రక్షణ, లైంగిక వేధింపుల నివారణ చట్టాలపై సోమవారం స్థానిక సంఘమిత్ర డిగ్రీ కళాశాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జడ్జి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పురుషులతో సమానంగా మహిళలకు కూడా చట్టాలు ఉన్నాయని తెలిపారు. ఎవరికై నా ఆపద సంభవిస్తే జిల్లా న్యాయసేవాధికార సంస్థను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా శిశు సంక్షేమశాఖ అధికారి మల్లీశ్వరి, మహిళా సాధికారత కోఆర్డినేటర్ అనూష, చైల్డ్ హెల్ప్‌లైన్ కోఆర్డినేటర్ తిరుపతి, సఖి అడ్మినిస్ట్రేటర్ గాయత్రి, సిబ్బంది మమతా, సురేష్, కృష్ణ పాల్గొన్నారు.
అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి అఖిల