
అదనంగా 16 విక్రయ కేంద్రాలు
రైతులకు సకాలంలో సరిపడా ఎరువులు
షెడ్యూల్ సిద్ధం చేయాలి..
భూపాలపల్లి: రైతులకు ఎరువుల విక్రయాల్లో రద్దీ తగ్గించి సౌకర్యవంతమైన విధంగా పంపిణీ చేయడానికి అదనంగా 16 ఎరువుల విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. ఐడీఓసీ కార్యాలయంలో వ్యవసాయ, సహకార శాఖల ఆధ్వర్యంలో సోమవారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనంగా ఏర్పాటు చేయనున్న ఎరువుల విక్రయ కేంద్రాలకు ఈ–పాస్ యంత్రాలను పంపిణీ చేశారు. రైతులకు సరిపడా ఎరువులను సకాలంలో అందించేందుకు చర్యలు చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహకార అధికారి వాల్యానాయక్, డీఏఓ బాబురావు, సిబ్బంది పాల్గొన్నారు.
అప్రమత్తంగా ఉండాలి..
వాతావరణ శాఖ సూచన మేరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ ఉన్న దృష్ట్యా ప్రజలు, అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రాహుల్ శర్మ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అత్యవసర సేవలకు ప్రజలు కంట్రోల్ రూం 90306 32608 నంబరుకు కాల్ చేయాలని తెలిపారు.
గ్రామస్థాయిలో విజయవంతం చేయాలి..
ఆది కర్మయోగి అభియాన్ మిషన్‌ను గ్రామస్థాయిలో మూవ్‌మెంట్ చేసి అన్ని శాఖల సమన్వయంతో విజయవంతం చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. ఐడీఓసీ కార్యాలయంలో ఆది కర్మయోగి అభియాన్ మిషన్‌పై వివిధ శాఖల జిల్లా అధికారులతో డిస్ట్రిక్ ప్రాసెస్ ల్యాబ్ అవగాహన సమావేశం నిర్వహించారు. కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, డీఎంహెచ్‌ఓ డాక్టర్ మధుసూదన్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి..
ప్రజల సమస్యల పరిష్కారానికి అధికారులు సత్వర చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. ఐడీఓసీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు నుంచి సమస్యలపై దరఖాస్తులు స్వీకరించారు.
వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలి
కలెక్టర్ రాహుల్ శర్మ
మహిళలు, చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకు చేపట్టిన స్వస్థ నారి–సశక్త పరివార్ అభియాన్ కార్యక్రమాల నిర్వహణకు షెడ్యూల్ తయారు చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. ఐడీఓసీ కార్యాలయ సమావేశపు హాల్‌లో పథకం నిర్వహణపై వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు అశోక్‌కుమార్, విజయలక్ష్మి, డీఎంహెచ్‌ఓ డాక్టర్ మధుసూదన్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.