
తెల్లవారుజామున 5 గంటలకే..
చిట్యాల మండలకేంద్రంలోని ఓడీసీఎంఎస్ విక్రయ కేంద్రం ఎదుట సోమవారం తెల్లవారుజామున ఐదు గంటల నుంచే రైతులు యూరి యా కోసం బారులుదీరారు. కేంద్రానికి ఆదివారం 222 బస్తాల యూరియా వచ్చింది. విషయం తెలుసుకున్న రైతులు సోమవారం వందలాది మంది ఒక్కసారిగా కేంద్రానికి రావడంతో పాటు చెప్పులను తెల్లవారుజామునుంచే లైన్లలో పెట్టారు. రైతులకు ఒక బస్తా యూరియా మాత్రమే ఇవ్వడంతో ఆవేదన వ్యక్తంచేశారు. పూర్తిస్థాయిలో యూరియా అందించడంలో అధి కారులు, పాలకులు ఏం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇప్పటికై నా సరిపడా యూరియా అందించాలని కోరుతున్నారు. – చిట్యాల
యూరియా కోసం బారులుదీరిన రైతులు