
దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచొద్దు
● ఎస్పీ కిరణ్ ఖరే
భూపాలపల్లి: ప్రజావాణిలో ప్రజలు అందజేసిన ఫిర్యాదులను పెండింగ్‌లో ఉంచకుండా తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఎస్పీ కిరణ్ ఖరే జిల్లాలోని పోలీసు అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించి 15 మంది నుంచి ఎస్పీ ఫిర్యాదులు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు త్వరితగతిన న్యాయం జరిగేలా చూడటమే పోలీసుశాఖ ధ్యేయమన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తీర్చడంలో పోలీసు విభాగం ఎల్లప్పుడూ ముందుంటుందని అన్నారు.
మంగపేట: కొత్తగా పోడు చేసినా, గుడిసెలు వేసిన చర్యలు తప్పవని డిప్యూటీ రేంజ్ అధికారి కోటేశ్వర్ హెచ్చరించారు. సోమవారం మంగపేట సమీపంలోని సండ్రోనిఒర్రె అటవీ ప్రాంతంలోని శాంతినగర్ గొత్తికోయ గూడెంలో గిరిజనులకు ఎస్సై టీవీఆర్ సూరీ ఆధ్వర్యంలో సీపీఎం, ఆదివాసీ గిరిజన సంఘం నాయకుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈనెల 4న పోడు భూముల్లో నూతనంగా గుడిసెలు వేస్తుండగా అటవీశాఖ అధికారులు దాడులు నిర్వహించి అడ్డుకుని కూల్చివేసిన విష యం తెలిసిందే. అటవీశాఖ చట్టాలు, విధివిధా నాలపై గొత్తికోయ గిరిజనులకు అవగాహన కల్పించారు.