
ప్రతాపగిరి గుట్ట అభివృద్ధికి ప్రణాళిక
కలెక్టరేట్‌లో మహా అన్నదానం
కాటారం: చారిత్రాత్మక, ఆధ్యాత్మికత కలిగిన కాటారం మండలం ప్రతాపగిరి సమీపంలోని ప్రతాపగిరి గుట్ట అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేయనున్నట్లు కలెక్టర్ రాహుల్‌శర్మ తెలిపారు. ప్రతాపగిరి గుట్టను ఎస్పీ కిరణ్‌ఖరేతో కలిసి కలెక్టర్ సందర్శించారు. సుమారు ఆరు కిలోమీటర్లు కాలినడకన కలెక్టర్, ఎస్పీ గుట్టపై ప్రాంతాన్ని చేరుకొని పరిశీలించారు. ప్రతాపగిరి గుట్ట విస్తీర్ణం, చారిత్రాత్మకత, ఆధ్యాత్మిక చరిత్రను అడిగి తెలుసుకున్నారు. పర్యావరణ పరిరక్షణ, పర్యాటక అభివృద్ధి అవకాశాలు, సహజ సంపదల సంరక్షణ అంశాలపై అటవీశాఖ అధికారులతో కలెక్టర్, ఎస్పీ చర్చించారు. కొండ ప్రాంతంలో పచ్చదనాన్ని పెంపొందించడానికి అటవీశాఖ ద్వారా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పర్యాటకులను ఆకర్షించేలా మౌలిక వసతుల ఏర్పాటుపై ప్రత్యేక ప్రణాళిక తయారు చేయాలని సూచించారు. ప్రకృతి సంపదను కాపాడుతూ అభివృద్థి కార్యక్రమాలు చేపట్టాలన్నారు. జిల్లాలో ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడానికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ముందుకెళ్లాలని కలెక్టర్ పేర్కొన్నారు. కలెక్టర్, ఎస్పీతో డీఎఫ్‌ఓ నవీన్‌రెడ్డి, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్‌సింగ్, అటవీశాఖ అధికారులు, సిబ్బంది ఉన్నారు.
కలెక్టర్ రాహుల్‌శర్మ
భూపాలపల్లి: గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఐడీఓసీ కార్యాలయ ఆవరణలో ఏర్పాటుచేసిన మట్టి వినాయక మండపం వద్ద గురువారం మహా అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అధికారులు, సిబ్బంది, కలెక్టరేట్‌కు వచ్చిన ప్రజలకు వడ్డించిన అనంతరం వారితో కలిసి కలెక్టర్ సహఫంక్తి భోజనం చేశారు. తొలిసారిగా ఐడీఓసీ కార్యాలయంలో వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించి 9 రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించడాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అశోక్‌కుమార్, విజయలక్ష్మి, ఆర్డీఓ రవి, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.