
సమస్యల పరిష్కారానికి నిరంతర పోరాటం
కాళేశ్వరం: ఎస్సీ, ఎస్టీల సమస్యల పరిష్కారారిని నిరంతరం పోరాటం చేస్తున్నామని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. బుధవారం ఆయన కాళేశ్వరముక్తీశ్వరస్వామిని కమిషన్ బృందంతో కలిసి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు వారికి పూర్ణకుంభ స్వాగతం పలికారు. స్వామివారి గర్భగుడిలో ప్రత్యేక అభిషేక పూజలు చేసి, పార్వతి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆశీర్వచన వేదిక వద్ద ఆలయ ఈఓ మహేష్ శాలువాతో ఆయనను సన్మానించి, స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం హరితహోటల్‌లో వెంకటయ్య మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలు సుభిక్షంగా ఉండాలని, సకాలంలో వర్షాలు కురిసి పాడిపంటలు పండాలన్నారు. తెలంగాణకు గుండెకాయ కాళేశ్వరం ప్రాజెక్టు అన్నారు. మేడిగడ్డ వద్ద పిల్లర్ కుంగిందని, రిపేర్లు చేసుకొని తెలంగాణకు నీటి సౌకర్యం కల్పించాలన్నారు. ఆయన వెంట కమిషన్ సభ్యులు కొంకటి లక్ష్మీనారాయణ, కుర్సంగి లీలాదేవి, నేనావత్ రాంబబాబు నాయక్ ఉన్నారు.
ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్
బక్కి వెంకటయ్య
కాళేశ్వరాలయంలో
కమిషన్ బృందం పూజలు