
పాత పెన్షన్‌ను పునరుద్ధరించాలి
భూపాలపల్లి అర్బన్: ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయుల పాలిట శాపంగా మారిన కాంట్రిబ్యూటరీ పెన్షన్ (సీపీఎస్) విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని వెంటనే అమలు చేయాలని ఉద్యోగ సంఘాల జేఏసీ జిల్లా చైర్మన్ బురుగు రవి డిమాండ్ చేశారు. సోమవారం పెన్షన్ విద్రోహ దినం పాటించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన రహదారి నుంచి కలెక్టరేట్ వరకు ఉద్యోగ, ఉపాధ్యాయులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ.. షరతులు లేని, కాంట్రిబ్యూట్ లేని విధంగా పెన్షన్‌ను అందించాలన్నారు. 30 సంవత్సరాలుగా ఉద్యోగ బాధ్యతలు నిర్వహించిన ఉద్యోగికి, ఉద్యోగ విరమణ అనంతరం భరోసా లేకుండా ఉన్నటువంటి షేర్ మార్కెట్ పెట్టుబడులపై ఆధారపడిన, స్థిరమైన పెన్షన్ లేని లోపభూయిష్టమైన ఈ అసంబద్ధమైన పెన్షన్ విధానాన్ని రద్దుచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగ సంఘాల నాయకులు విజయలక్ష్మి, దిల్హాత్, తిరుపతి, రామారావు, జ్ఞానేశ్వర్, సురేందర్, అన్వర్, మురళీదర్, శ్రీదేవి, సునీల్, సందాని, మురళీధర్‌రావు, కిరణ్‌కుమార్, రవీందర్‌రెడ్డి, మధుసూదన్, భార్గన్, రమణారెడ్డి, రాజ్‌కుమార్, హరిప్రసాద్ పాల్గొన్నారు.