
పర్యాటకంగా అభివృద్ధి చేస్తా
రేగొండ: బుగులోని, పాండవుల గుట్టలను పర్యాటకంగా అభివృద్ధి చేస్తానని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. తిరుమలగిరి శివారులోని బుగులోని వెంకటేశ్వర స్వామి జాతరలో రూ.1.60 కోట్లతో పలు అభివృద్ధి పనులకు సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత పాలకులు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే అవకాశమున్నా ఆ దిశగా కృషి చేయలేదని విమర్శించారు. గతంలోనే జాతరకు వచ్చే రోడ్ల నిర్మాణం కోసం నిధులు మంజూరు కాగా కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో పనులు ప్రారంభం కాలేదన్నారు. త్వరితగతిన పనులు పూర్తయ్యేలా అధికారులు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, కంజర్వేటర్ ప్రభాకర్, డీఎఫ్‌ఓ నవీన్‌రెడ్డి, తహసీల్దార్ శ్వేత, ఎంపీడీఓ వెంకటేశ్వరరావు, పీఏసీఎస్ చైర్మన్ నడిపల్లి వెంకటేశ్వరరావు, నాయకులు సంపత్‌రావు, ఉమేష్ గౌడ్, పున్నం రవి, నిమ్మల విజేందర్, శంకర్, శ్రీనివాస్, భిక్షపతి, రమేష్ పాల్గొన్నారు.
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు