
దాటాలంటే సాహసమే..
భూపాలపల్లి–మల్హర్ మండలాల మధ్య సరైన రోడ్డు మార్గం లేకపోవడంతో అడవి మార్గంలో వెళ్లాల్సి వస్తుంది. ఇటీవల తాడిచర్ల ఓపెన్‌కాస్టు నుంచి గణపురం మండలం చెల్పూర్ కేటీపీపీ వరకు ఏర్పాటు చేస్తున్న కన్వేయర్ బెల్ట్ రోడ్డు కాశీంపల్లి వరకు మట్టిపోసి తాత్కాలికంగా ఏర్పాటు చేశారు. ఈ రోడ్డు అడవిలో వర్షం వరదకు కొట్టుకుపోయింది. దీంతో తాటిచెట్లు, కర్రలు వరద కాలువలపై వేసి ద్విచక్ర వాహనాలపై దాటుతున్నారు. దూరభారం తగ్గించుకునేందుకు ఈ మార్గం ద్వారా భూపాలపల్లి, మంథని, తాడిచర్ల ఓపెన్‌కాస్టులో పనిచేసే కార్మికులు నిత్యం ద్విచక్ర వాహనాలపై వందల సంఖ్యలో రాకపోకలు కొనసాగిస్తున్నారు. దారిలో ఏమైనా అనారోగ్య పరిస్థితి వస్తే అంబులెన్స్ రావడానికి మార్గం కూడా లేదు. – భూపాలపల్లి అర్బన్

దాటాలంటే సాహసమే..