
శాంతిభద్రతల పరిరక్షణ అందరి బాధ్యత
రేగొండ: గ్రామాలలో శాంతిభద్రతల పరిరక్షణ అందరి బాధ్యత అని గణపురం సీఐ కరుణాకర్ రావు అన్నారు. శనివారం మండలంలోని భాగిర్థిపేటలో గణపురం సీఐ కరుణాకర్‌రావు ఆధ్వర్యంలో పోలీసులు కార్డన్‌సెర్చ్ నిర్వహించి 50 వాహనాలను సీజ్ చేశారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. యువత గంజాయి వంటి మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవర్చుకోవాలన్నారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలన్నారు. లైసెన్స్, ఇన్సురెన్స్‌తో పాటు వాహన పత్రాలు చట్ట నిబంధనలకు లోబడి ఉండాలన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠినమైన చర్యలు ఉంటాయని చెప్పారు. గ్రామంలో ఎవరైనా అనుమానాస్పదంగా తిరిగితే తమకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రేగొండ ఎస్సై రాజేష్, గణపురం ఎస్సై అశోక్, కొత్తపల్లిగోరి ఎస్సై దివ్య, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.