
సాగుదారులను ఇబ్బందులకు గురిచేయొద్దు
● కాటారం సబ్‌కలెక్టర్ మయాంక్‌సింగ్
కాటారం: ఆర్‌ఓఎఫ్‌ఆర్ ద్వారా పట్టాలు పొందిన భూముల్లో సాగు చేసుకుంటున్న రైతులను ఇబ్బందులకు గురిచేయవద్దని కాటారం సబ్ కలెక్టర్ మయాంక్‌సింగ్ అటవీశాఖ అధికారులకు సూచించారు. మహాముత్తారం మండలం మీనాజీపేటలో ఆర్‌ఓఎఫ్‌ఆర్ పట్టా భూములను శనివారం సబ్ కలెక్టర్ పరిశీలించారు. రైతులు సాగునీటి కోసం బోర్లు వేసుకుంటున్న క్రమంలో అటవీశాఖ అధికారులు అడ్డుకున్నారు. దీంతో పలువురు సబ్ కలెక్టర్ దృష్టికి తీసుకురావడంతో ఆయన పరిశీలించి రైతులు, అటవీశాఖ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. బోర్లు వేసుకోవడానికి అభ్యంతరాలు చెప్పవద్దని అటవీశాఖ అధికారులను ఆదేశించారు. సబ్ కలెక్టర్ వెంట తహసీల్దార్ శ్రీనివాస్, అటవీశాఖ అధికారులు ఉన్నారు.