
సమస్యలు పరిష్కరించాలని వినతి
భూపాలపల్లి రూరల్: భూపాలపల్లి మున్సిపల్ పరిధిలోని పలు సమస్యలను పరిస్కరించాలని కోరుతూ బీజేపీ అర్బన్ అధ్యక్షుడు గీస సంపత్ కుమార్ ఆధ్వర్యంలో నాయకులు శనివారం మున్సిపల్ మేనేజర్ సుబాష్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి దొంగల రాజేందర్ మాట్లాడుతూ మిషన్‌భగీరథ కలుషితమైన నీరు తాగడం వలన ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నారన్నారు. వర్షాకాలం ప్రారంభమైనప్పటికీ దోమల నివారణ కోసం చర్యలు చేపట్టలేదన్నారు. పట్టణంలో చెత్తాచెదారం డ్రెయినేజీల్లో పేరుకుపోయి ఉందన్నారు. అధికారులు చొరవ తీసుకొని సమస్యలు పరిష్కరించాల ని కోరారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో నాయకులు బట్టు రవి, తాటి కంటి రవికుమార్, జోరు కృష్ణ, బండారు లోకేష్, దేవరకొండ వెంకటేష్, తాండ్ర హరీశ్, సంతోష్ పాల్గొన్నారు.