
ఉధృతంగా ప్రవహిస్తున్న మానేరు
ఉధృతంగా ప్రవహిస్తున్న అడవిసోమన్‌పల్లి మానేరు
మల్హర్: రెండు, మూడు రోజులుగా కురిసిన వర్షాల కారణంగా జిల్లా సరిహద్దు అడవి సోమన్‌పల్లి మానేరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో మానేరుకు జలకళ సంతరించుకుంది. మండలంతో పాటు భూపాలపల్లి, కరీంనగర్ జిల్లాలో కురిసిన వర్షాలతో మానేరుకు భారీగా వరద నీరు చేరుకుంది. దీనికి తోడు కరీంనగర్ డ్యాం గేట్లు ఎత్తడంతో వాగుకు ఇరువైపులా నీరు ప్రవహించడంతో మానేరు నిండు కుండాలా దర్శనమిస్తుంది. సోమన్‌పల్లి, కొయ్యూరు పీవీనగర్‌కు మధ్యలో ఏర్పాటు చేసిన చెక్‌డ్యాం మీదుగా వరద నీరు పరవళ్లు తొక్కుతోంది.

ఉధృతంగా ప్రవహిస్తున్న మానేరు