
క్రీడలను భాగస్వామ్యం చేసుకోవాలి
భూపాలపల్లి అర్బన్: ప్రతి ఒక్కరూ క్రీడలను జీవితంలో భాగస్వామ్యం చేసుకొని ఆరోగ్యకరమైన జీవనశైలిని అవలంభించాలని ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు. హాకీ మాంత్రికుడు ధ్యాన్ చంద్ జన్మదినాన్ని పురస్కరించుకొని శుక్రవారం జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఏరియాలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సింగరేణి వర్క్‌పీపుల్స్ గేమ్స్ అసోసియేషన్ 26వ వార్షిక క్రీడ పోటీలను జీఎం ప్రారంభించారు. ఈ క్రీడపోటీలు మన ఆరోగ్య సాధనలో భాగం కావాలని, సంస్థకు మంచిపేరు తీసుకురావాలని అ న్నారు. సింగరేణి సంస్థ క్రీడల ప్రోత్సాహానికి, యు వ ఉద్యోగులలో ప్రతిభను వెలికితీసి దేశ స్థాయిలో రాణించాలనే ఉద్దేశంతో క్రీడాకారులను ప్రోత్సహిస్తుందన్నారు. సింగరేణి సంస్థను మొదటి స్థానంలో ఉండే విధంగా కృషి చేయాలని యువ క్రీడాకారులకు, ఉద్యోగులకు జీఎం సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌వోటు కవీంద్ర, అధికారులు మారుతి, శ్రావణ్‌కుమార్, నజీర్, గుర్తింపు, ప్రాతినిథ్య సంఽఘాల నాయకులు రమేష్, మధుకర్‌రెడ్డి, స్పోర్ట్స్ సూపర్‌వైజర్ శ్రీనివాస్, స్పోర్ట్స్ కోఆర్డినేటర్ పాక దేవయ్య, కెప్టెన్‌లు, క్రీడాకారులు పాల్గొన్నారు.
సింగరేణి జనరల్ మేనేజర్ రాజేశ్వర్‌రెడ్డి