
23 అడుగులకు చేరిన గణపసముద్రం
గణపురం: గణపసముద్రం చెరువు నీటి మట్టం 31 అడుగులు కాగా.. మొన్నటి వరకు 18 అడుగుల నీటిమట్టం ఉండగా ఒక్కరోజులోనే ఐదు అడుగుల నీటిమట్టం పెరిగి 23 అడుగులకు చేరుకుంది. దీంతో చెరువు నిండుకుండలా మారింది. గణపసముద్రం చెరువు పైన ఉన్న గొలుసు కట్టు చెరువులైన బుద్ధారం వంగపెల్లి వాని చెరువు, భాగిర్థిపేట రామన్న చెరువులు మత్తళ్లు పోస్తుండడంతో పెద్ద ఎత్తున వరద గణపసముద్రం చెరువుకు చేరుకుంటుంది. మరో రెండు రోజులు వర్షాలు కురిస్తే గణపసముద్రం చెరువు మత్తడి పోసే అవకాశం వుంది. మండలంలోని నగరంపల్లి మొసళ్లకుంటకు గండి పడింది.
ఉప్పొంగి ప్రవహిస్తున్న మోరంచవాగు