
స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటు చేయాలి
పల్లెల్లో ఆటస్థలాలు లేకపోవడంతో క్రీడాపాఠశాలకు ఎంపిక కోసం సిరొంచ గ్రౌండుకు వెళ్లి ప్రాక్టీస్ చేయించాను. మూడేళ్లుగా ఎనిమిది మంది విద్యార్థులు నా ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయిలో క్రీడాపాఠశాలలకు ఎంపికయ్యారు. గ్రౌండు ఉంటే మరింత మంది భవిష్యత్‌లో పెద్ద స్థాయి ఆటల్లో ఉంటారు. ప్రభుత్వం మినీ స్టేడియాలు ఏర్పాటు చేయాలి. క్రీడాకారులను ప్రొత్సహించాలి. మంత్రి శ్రీధర్‌బాబు ప్రత్యేక దృష్టితో కాళేశ్వరంలో స్పోర్ట్స్ స్కూల్, అకాడమీ ఏర్పాటు చేస్తే ఈ ప్రాంత విద్యార్థులకు ఉపయోగంగా ఉంటుంది. – కీర్తి శ్రీనివాస్, కోచ్ కాళేశ్వరం