
జిల్లాలో ఎడతెరిపి లేని వర్షం
న్యూస్‌రీల్
శుక్రవారం శ్రీ 29 శ్రీ ఆగస్టు శ్రీ 2025
మోరంచవాగు ప్రవాహంతో నీట మునిగిన వరి పొలాలు
టేకుమట్ల: వర్షాలకు చలివాగు ఉప్పొంగింది. చెరువులు మత్తడి పోశాయి. మండల కేంద్రం నుంచి అంకుషాపూర్, సుబ్బక్కపల్లి ప్రధాన రోడ్డులోని లోలెవల్ కల్వర్టులు ఉప్పొంగడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. టేకుమట్ల–అంకుషాపూర్ లోలెవల్ కల్వర్టు వద్ద వరద ఉధృతి పెరగడంతో ఇరువైపులా ముళ్ల కంచెలను ఏర్పాటు చేసి ఉదయం నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు గ్రామ పంచాయతీ సిబ్బంది కాపలా కాశారు.
అలుగు పారుతున్న దొమ్మిడిపెల్లి చెరువు
రేగొండ: రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు రేగొండ, కొత్తపల్లిగోరి మండలాలలో ఇటీవల వేసిన వరి నాట్లు పూర్తిగా నీటమునిగాయి. మిరప నారు మడులు నీటిలో మునిగిపోయాయి. మండలంలోని చిన్నకొడేపాక, మడ్తపల్లి, పొనగండ్ల గ్రామాలలోని చెరువులు అలుగు పోశాయి.
ఉధృతంగా ప్రవహిస్తున్న మోరంచవాగు
2వేల ఎకరాల వరిపంటకు నష్టం
నిండు కుండలా గణపసముద్రం
ఓపెన్‌కాస్ట్ గనుల్లో నిలిచిన బొగ్గు ఉత్పత్తి

జిల్లాలో ఎడతెరిపి లేని వర్షం

జిల్లాలో ఎడతెరిపి లేని వర్షం