
ఆడబిడ్డలకు వరం కల్యాణలక్ష్మి
టేకుమట్ల: కల్యాణలక్ష్మి పథకం ఆడబిడ్డలకు వరమని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. గురువారం మండలకేంద్రంలో లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో చేయలేని సంక్షేమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం చేసి చూపిస్తుందని అన్నారు. సన్న బియ్యం, కొత్త రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, జిల్లాకేంద్రంలో కార్పొరేట్ స్థాయిలో విద్యావ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. విద్యావ్యవస్థ మెరుగుపడేందుకు నూతన కోర్సులను తీసుకువచ్చినట్లు చెప్పారు. రానున్న రోజుల్లో మరింత సంక్షేమాన్ని ప్రజల ముందు ఉంచబోతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ విజయలక్ష్మి, ఆర్‌ఐ సంతోష్‌కుమార్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కోటగిరి సతీష్‌గౌడ్, మాజీ జెడ్పీటీసీ పులి తిరుపతిరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ గుమ్మడి శ్రీదేవి, తదితరులు ఉన్నారు.
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు