
ఉచిత వైద్యశిబిరాలు
పలిమెల: పలిమెల, మహదేవ్‌పూర్ మండల పరిధిలోని అంబటిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ కల్యాణి, ఎమ్‌ఎల్‌హెచ్‌పీ డాక్టర్ మల్లికార్జున్ ఆధ్వర్యంలో మండలంలోని మోదేడులో శుక్రవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులు జ్వరాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, డ్రై డే ఫ్రైడే కార్యక్రమాలు, ప్రభుత్వం ద్వారా అందించే వైద్య సదుపాయాల గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్‌వైజర్ మాసుక్ అలీ, ఏఎన్‌ఎం శ్రీలత, ఆశ వర్కర్ సమ్మక్క, గ్రామస్తులు పాల్గొన్నారు.
మొగుళ్లపల్లి: మండలంలోని కోర్కిశాల గ్రామస్తులకు, మోడల్ స్కూల్, కస్తూరిబాగాంధీ హాస్టల్‌లోని విద్యార్థులకు వైద్య శిబిరం ఏర్పాటు చేశా రు. వైద్యాధికారి నాగరాణి పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ రాకేశ్, కస్తూరిభాగాంధీ ప్రిన్సిపాల్ శైలజ, హెల్త్ అసిస్టేంట్ భిక్షపతి, ఎన్‌ఏంలు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు పాల్గొన్నారు.