
జిల్లా గ్రంఽథాలయ సంస్థ చైర్మన్‌గా ‘కోట’
కాళేశ్వరం: జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా మహదేవపూర్ మండల కేంద్రానికి చెందిన కోట రాజబాపును నియమిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్ర సెక్రటేరియట్‌లో ఆర్డర్‌కాపీని తీసుకొని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబును మర్యాదపూర్వకంగా కలిశారు. రాజబాపు గతంలో సర్పంచ్‌గా, కాళేశ్వరం దేవస్థానం చైర్మన్‌గా పనిచేశారు. ప్రస్తుతం బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఆయనకు కాంగ్రెస్‌పార్టీ నాయకులు అభినందనలు తెలిపారు. ఆయన వెంట మాజీ దేవస్థానం డైరెక్టర్ అశోక్, నాయకులు శ్రీశైలం ఉన్నారు.