
సంతోషంతో సమానంగా ఇబ్బందులు..
మాకు ముగ్గురు పిల్లలు. పాఠశాలకు పంపేందుకు పిల్లలను తయారు చేయడంతో పాటు ఫీజులు తదితర ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. అయినప్పటికీ కష్టంతో కూడిన సంతోషాన్ని అనుభవిస్తున్నాం. గతంలో మా తల్లితండ్రులతో ఉన్నప్పుడు పిల్లలను చూసుకోవడం పెద్దగా ఇబ్బంది అయ్యేది కాదు. ఉద్యోగ రీత్యా తల్లితండ్రులకు దూరంగా ఉండి పిల్లలను చూసుకోవడం కొంత ఇబ్బందికరంగా మారింది. అయినా కష్టాలను ఓర్చుకుంటూ ఎవరికీ ఇబ్బంది రాకుండా చూసుకుంటున్నాం. ఒకరికి మాత్రమే జన్మనిస్తే చిన్నారులు తోడబుట్టిన వారు లేక కుంగిపోయే అవకాశం ఉంది. ఇద్దరు, ముగ్గురు పిల్లలు ఉంటే చిన్నతనంలో కొంత కష్టమైనా పెద్ద పెరిగాక కష్టసుఖాల్లో ఒకరినొకరు పాలుపంచుకుంటారు అనేది మా ఉద్ధేశం. ముగ్గురు పిల్లలు ఉండటం వలన ఒకరినొకరు ఆప్యాయత, అనురాగాలు, ప్రేమ, బంధాల మధ్య పెరుగుతున్నారు.
– పసునూటి శ్రీనివాస్, భూపాలపల్లి