
ఇళ్ల నిర్మాణం త్వరగా పూర్తిచేయాలి
అదనపు కలెక్టర్ విజయలక్ష్మి
రేగొండ: ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను లబ్ధిదారులు త్వరగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ విజయలక్ష్మి అన్నారు. శనివారం మండలంలోని రంగయ్యపల్లి, లింగాల గ్రామాలలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో మాట్లాడారు. బేస్మెంట్ వరకు ఎంత ఖర్చు అయింది. మెటీరియల్ కొనుగోలులో ఏమైనా ఇబ్బందులు తలెత్తుతున్నాయా.. అని లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. ప్రతీ సోమవారం లబ్ధిదారులకు ఆయా ఇళ్ల స్థితికి అనుగుణంగా బిల్లులు చెల్లించనున్నట్లు చెప్పారు. బిల్లుల చెల్లింపులో జాప్యం జరగదని తెలిపారు. ఆమె వెంట ఎంపీఓ రాంప్రసాద్, పంచాయతీ కార్యదర్శులు జీవిత, రాము, తదితరులు ఉన్నారు.