
అభివృద్ధి పథం..
కార్యకర్తల్లో జోష్..
బహిరంగ సభల్లో డిప్యూటీ సీఎం, మంత్రుల ప్రసంగాలతో కాంగ్రెస్ కార్యకర్తల్లో జోష్ నిండింది. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించాలని మల్లు భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రైతులకోసం రూ.70వేల కోట్లు ఖర్చుచేసి రైతు ప్రభుత్వమని నిరూపించుకున్నామన్నారు. మహబూబాబాద్ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. జిల్లాకు గోదావరి జలాల మళ్లింపుపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళీనాయక్ మాట్లాడుతూ.. మారుమూల ప్రాంతమైన మానుకోట అభివృద్ధికి మరిన్ని నిధులు ఇవ్వాలని, ఇంజనీరింగ్ కళాశాల, ఔటర్ రింగ్‌రోడ్డుకు నిధులు మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమాల్లో డిప్యూటీ స్పీకర్ రాంచంద్రునాయక్, ఎంపీ బలరాంనాయక్, ఎమ్మెల్యేలు కనకయ్య, నాగరాజు, ట్రైకార్ చైర్మన్ బెల్ల య్య నాయక్, కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో, కేసముద్రం మార్కెట్ కమిటీ చైర్మన్ గంట సంజీవరెడ్డి, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
● మానుకోట జిల్లా సోమ్లాతండా, కేసముద్రంలో
రూ.400కోట్ల పనులకు శంకుస్థాపనలు
● హాజరైన డిప్యూటీ సీఎం, ఐదుగురు మంత్రులు
సాక్షి, మహబూబాబాద్/ కేసముద్రం/మహబూబా బాద్ రూరల్: మహబూబాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 400కోట్లు మంజూరు చేసింది. ఈమేరకు మంగళవారం అభివృద్ధి పనుల శంకుస్థాపనకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌రావు, ధనసరి సీతక్క, కొండా సురేఖ, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా సోమ్లాతండా, కేసముద్రంలో ఏర్పాటు చేసిన బహిరంగసభలకు మహిళలు, కార్యకర్తలు భారీగా హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు సభికులను అలరించాయి.
రూ.400కోట్ల పనులకు శంకుస్థాపన
మహబూబాబాద్ పరిధిలో సుమారు రూ.100కోట్లతో రహదారులు, మున్సిపాలిటీ అభివృద్ధి, ట్రైబల్ వెల్ఫేర్ భవనాలు, నూతన సబ్ స్టేషన్ నిర్మాణానికి శుంకుస్థాపనలు చేశారు. అలాగే రూ.300కోట్లతో కేసముద్రం పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీ భవన నిర్మాణం, అంగన్‌వాడీ కేంద్రం, పట్టణంలో 30పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నిర్మాణం, నూతన సబ్‌స్టేషన్లు, సీసీరోడ్లు, కల్వర్టులు, అంతర్గత రోడ్ల అభివృద్ధి పనులు, ఎస్సీ కమ్యూనిటీ హాల్, నూతన గిడ్డంగుల నిర్మాణం, ఆలయాల అభివృద్ధి, తదితర పనులకు శంకుస్థాపన చేశారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ ప్రొసీడింగ్ పత్రాల పంపిణీ, జిల్లాలోని స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలు మంజూరు చేశారు.
మంత్రులు ఏమన్నారంటే...
– వివరాలు 8లోu

అభివృద్ధి పథం..

అభివృద్ధి పథం..