
సబ్‌కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
కాళేశ్వరం: మహదేవపూర్ మండలంలో కాటారం సబ్‌కలెక్టర్ మయాంక్‌సింగ్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రభుత్వ సామాజిక ఆస్పత్రిని పరిశీలించి వైద్యులతో మాట్లాడారు. మెడికల్ సిబ్బంది, ఎమ్మార్సీ ఉద్యోగుల రిజిస్టర్లను తనిఖీ చేశారు. కాళేశ్వరంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుల హాజరు రిజిస్టర్‌ను చూశారు. అక్కడి మౌలిక సదుపాయాలు, విద్యార్థుల హాజరు, గతేడాది ఎస్సెస్సీ ఫలితాలపై ఎంఈఓలను అడిగి తెలుసుకున్నారు. కాళేశ్వరంలోని సర్వేనంబర్ 129లో నూతన బస్టాండ్ నిర్మాణం కోసం స్థలాన్ని పరిశీలించారు. ఆయన వెంట డిప్యూటీ తహసీల్దార్ కృష్ణ ఉన్నారు.
నవోదయ ప్రవేశాల
దరఖాస్తుల స్వీకరణ
భూపాలపలి అర్బన్: నవోదయ విద్యాలయాల్లో 6వ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు కలెక్టర్ రాహుల్‌శర్మ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్‌లో అడ్మిషన్ల వాల్‌పోస్టర్ ఆవిష్కరించారు. 6వ తరగతి 2026–27 విద్యా సంవత్సరానికి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు చెప్పారు. ఈ నెల 29వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. డిసెంబర్ 13వ తేదీన అర్హత ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు. వివరాలకు 91107 82213, 79932 63431 ఫోన్ నంబర్లను సంప్రదించాలని సూచించారు.
ప్రజా సమస్యల
పరిష్కారమే ధ్యేయం
భూపాలపల్లి అర్బన్: ప్రజా సమస్యలను వెలికితీసి వాటిని పరిష్కరించే విధంగా సీపీఐ నాయకులు పనిచేయాలని పార్టీ జిల్లా కార్యదర్శి కొరిమి రాజ్‌కుమార్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో సోమవారం జరిగిన సీపీఐ భూపాలపల్లి మండల నాలుగవ మహాసభ కుడుదుల వెంకటేష్ ఆధ్వర్యంలో నిర్వహించగా రాజ్‌కుమార్ మాట్లాడారు. పార్టీ కార్యకర్తలు అలుపెరగకుండా ప్రజల కోసం పని చేయాలని కొనియాడారు. పార్టీ అభివృద్ధి కోసం కార్యకర్తలు పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు సతీష్, వైకుంఠం, రాజయ్య, బాబు, రాజయ్య, రజిత, పవన్‌కల్యాణ్, రమేష్ పాల్గొన్నారు.
విజయవంతం చేయాలి
భూపాలపల్లి అర్బన్: ఈ నెల 9న సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని ఏఐటీయూసీ, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శులు క్యాతరాజ్ సతీష్, చెన్నూరి రమేష్ కోరారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఏఐటీయూసీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా తెచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లు కార్మిక హక్కులను కాలరాసే విధంగా ఉన్నాయన్నారు. వాటిని వెంటనే రద్దు చేసి పాత హక్కులను అమలు చేయాలని కోరారు. సమావేశంలో నాయకులు శ్రీకాంత్ పవన్, రాజయ్య పాల్గొన్నారు.

సబ్‌కలెక్టర్ ఆకస్మిక తనిఖీ