
ఆదివారం శ్రీ 6 శ్రీ జూలై శ్రీ 2025
– 8లోu
కాటారం
24
1,378
గణపురం
17
822
చిట్యాల
25
961
మహదేవపూర్ 18
1,354
భూపాలపల్లి
24
1,322
మల్హర్
15
1,133
మొగుళ్లపల్లి25
413
అమలుకాని ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం
● లబ్ధిదారుల ఎంపిక పూర్తి
● నెరవేరని వ్యవసాయ కూలీలకు ఏడాదికి రూ.12వేల హామీ
● కూలీలకు తప్పని ఎదురుచూపు
రేగొండ
37
847
ఎంపిక చేశారు..
డబ్బులివ్వలేదు..
మాకు వ్యవసాయ భూమి లేదు. ఉపాధి హామీ, వ్యవసాయ పనులకు వెళ్లి జీవనం సాగిస్తున్నాం. భూమి లేని వారికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద ఏడాదికి రూ.12వేలు వస్తాయంటే సంతోషపడ్డాం. ఆ పథకానికి నేను ఎంపిక అయిన్నట్లు గ్రామ సభలో ప్రకటించారు. ఇప్పటి వరకు డబ్బులు ఖాతాలో జమ కాలేదు.
– మల్కపురం మమత, కొంపెల్లి
టేకుమట్ల
24
460
భూపాలపల్లి రూరల్: ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ పథకం పైలెట్ ప్రాజెక్టు కింద జిల్లాలోని 11 గ్రామాల్లో ప్రారంభించి ఐదు నెలలు అవుతున్నప్పటికీ జిల్లావ్యాప్తంగా అమలు కావడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారంటీ పథకాల్లో భాగంగా రైతు కూలీలకు ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ కింద వ్యవసాయ కూలీలకు ఏడాదికి రూ.12వేల చొప్పున ఇస్తామని ప్రకటించింది. లబ్ధిదారుల ఎంపిక పూర్తయినప్పటికీ డబ్బులు మాత్రం జమ కావడం లేదు.
పైలెట్ గ్రామాలకే పరిమితమా..
భూమిలేని ఉపాధి హామీ కూలీలకు రైతు భరోసా కింద ఏటా రూ.12వేల ఆర్ధిక సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రెండు విడతల్లో సాయం అందించనుంది. అందులో భాగంగా జనవరి 28న జిల్లా వ్యాప్తంగా ఒక్కో మండలం ఒక్కో గ్రామాన్ని పైలెట్ ప్రాజెక్ట్‌గా ఎంపిక చేసి 207 మందికి మొదటి విడతగా రూ.6 వేల చొప్పున ఆత్మీయ భరోసా అందించారు.
11 గ్రామాలకే ..
జిల్లాలో 11మండలాల్లో ఒక్కో గ్రామ పంచాయతీని పైలెట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేసి జనవరి 26న ఇందిరమ్మ ఆత్మీయ భరోసా మంజూరు పత్రాలను అందజేశారు. వారికి మరో నెల రోజులైతే రెండో విడత సాయం అందించాల్సిన సమయం వస్తుంది. మిగతా లబ్ధిదారులకు ఆత్మీయ భరోసా వస్తుందా.. రాదా అని ఆందోళన చెందుతున్నారు. ఎప్పుడు ఇస్తారనే ది అధికారులు చెప్పడం లేదని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి ఇంది రమ్మ ఆత్మీయ భరోసా కింది ఎంపిక చేసిన లబ్ధి దారులకు సాయం అందజేయాలని కోరుతున్నారు.
జిల్లా వ్యాప్తంగా ఇలా..
వ్యవసాయ భూమి లేనివారు, ఉపాధి హామీ కూలీగా 20 రోజుల పాటు పనిచేసిన వారు అర్హులని నిబంధన పెట్టారు. లబ్ధిదారుల ఎంపిక కోసం ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లు క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారు. జిల్లాలో 241 గ్రామాల్లో 9,655మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. వారిలో ఇప్పటివరకు 207మందికే అందించడంతో మిగితా గ్రామాల నుంచి లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారు.
గ్రామాలు
లబ్ధిదారుల
సంఖ్య
●
జాబితా పంపించాం..
ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కోసం ప్రభుత్వ ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి లబ్దిదారులను ఎంపిక చేశాం. ఆ జాబితాను కలెక్టర్ ఆదేశాలతో ప్రభుత్వానికి నివేదించాం.
– బాలకృష్ణ, డీఆర్‌డీఓ
న్యూస్‌రీల్

ఆదివారం శ్రీ 6 శ్రీ జూలై శ్రీ 2025

ఆదివారం శ్రీ 6 శ్రీ జూలై శ్రీ 2025

ఆదివారం శ్రీ 6 శ్రీ జూలై శ్రీ 2025

ఆదివారం శ్రీ 6 శ్రీ జూలై శ్రీ 2025

ఆదివారం శ్రీ 6 శ్రీ జూలై శ్రీ 2025