
గోరింటాకు వేడుకలు
భూపాలపల్లి అర్బన్: ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని సింగరేణి ఏరియాలోని ఇల్లందు క్లబ్‌లో లేడీస్ క్లబ్ ఆధ్వర్యంలో శనివారం గోరింటాకు వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు. సింగరేణి సేవా, లేడీస్ క్లబ్ అధ్యక్షురాలు ఏనుగు సునీత రాజేశ్వర్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా గోరింటాకు పోటీలను నిర్వహించుకొని అరచేతిలో గోరింటాకు ఎర్రగా పండడంతో మహిళల మొహంలో ఆనందం వెల్లివిరిసింది. గోరింటాకు పోటీలలో విజేతలైన వారికి బహుమతులు అందించారు. ఈ సందర్భంగా సునీత రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. గోరింటాకు చర్మవ్యాధుల నుంచి రక్షిస్తుందని చెప్పారు. గోరింటాకుతో ఆరోగ్యపరంగా అనేక ఉపయోగాలు ఉంటాయన్నారు. గోరింటాకు జుట్టుకు బలాన్ని ఇవ్వడంతో పాటు చుండ్రును తగ్గించడానికి ఉపయోగపడుతుందని తెలిపారు. ఆషాఢ మాసంలో గోరింటాకు అలంకరణ తెలుగు వారి సంప్రదాయమన్నారు.
గోరింటాకు పెట్టుకొని మురిసిపోతున్న మహిళలు

గోరింటాకు వేడుకలు